మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రాజెక్టులోకి 8000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏ ఈ ఈ శివ అన్నారు. ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది కావున రెండు గేట్ల ద్వారా అంతే నీటిని దిగువ మంజీర నదిలోకి వదులుతున్నట్లు ఆయన తెలిపారు. నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి ప్రాజెక్టులో 17.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది.