కే టి కుంజుమన్, శంకర్, ఏ. ఆర్. రెహమాన్, ప్రభుదేవ, నగ్మా కాంబోలో రూపొంది సంచలన విజయం సాధించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమాని రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రీ రిలీజ్ ప్రెస్ మీట్‌కి అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి, నిర్మాతలు రమణ, మురళీధర్ పాల్గొన్నారు. నిర్మాతలు రమణ, మురళీధర్ మాట్లాడుతూ, ’30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సష్టించిన సినిమాని మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ప్రభుదేవాతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లు కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.