మరోసారి సీఎం కేసీఆర్ కు ఓటు వేసి గెలుపిస్తాం..

నవతెలంగాణ-తొగుట
నిర్వాసితులకు అన్ని విధాలుగా సహకారం అందించిన సీఎం కేసీఆర్ కు ఓటు వేసి గెలుపిస్తా మని రజక సంఘం సభ్యులు తీర్మానం చేశారు. ఆదివారం మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ సర్పంచ్ కొల్చల్మే స్వామి ఆధ్వ ర్యంలో రజక సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.వారితో మాట్లాడి మరోసారి కెసిఆర్ కు ఓటు వేద్దామని సభ్యులం తా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ నిర్వాసితులందరికి పూర్తి సహకా రం అందించామని అన్నారు.ఎవరికైనా పరిహారం రాకుంటే ఎన్నికల అనంతరం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.గ్రామస్థులు అందరూ సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతకింది స్వామి, వార్డు సభ్యులు జూకంటి రాములు, సందనమైన కనకరాజు, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.