నవతెలంగాణ – మల్హర్ రావు
తాము పదవిలో ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం రూ.2.31 లక్షల అభివృద్ధి పనులు చేపట్టి, సంబంధించిన అధికారులతో రికార్డులు, చెక్ మేకర్ చేయించిన నేపథ్యంలో 2023-2024 ఆర్థిక సంఘం నుంచి బిల్లులు చేయాలని, మండల ఎంపీఓ చుట్టూ నెలల తరబడి ప్రదక్షణలు చేసీనా, బిల్లులు చేయకపోవడంపై నిరసనగా సోమవారం మండలంలోని చిన్నతూండ్ల మాజీ సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య దంపతులు జీపీ ట్రాక్టర్ స్వాధీనం చేసుకొని, బిల్లులు ఇచ్చేంత వరకు ట్రాక్టర్ ఇవ్వమని ఇంటివద్దకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు మంగళవారం మండల ఎంపీఓ విక్రమ్ కుమార్ స్పందిస్తూ, (డిఎస్.కె) డిజిటల్ సిగ్నిచర్ కీ మార్చే ప్రక్రియ పూర్తి కాగానే రెండు, మూడు రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లించడం జరుగుతుందని హామీ ఇవ్వడం, ఇందుకు తోడుగా గ్రామపంచాయితీ పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో తీసుకెళ్లిన ట్రాక్టర్ ను పంచాయతీ కార్యాలయంకు తిరిగి అప్పజెప్పినట్లుగా మాజీ సర్పంచ్ తెలిపారు.