నవతెలంగాణ – తొగుట
సిద్దిపేట కు రింగురోడు బాగానే ఉంది గాని పక్క గ్రామాలకు ప్రమాదంగా మారిందని ఆయాగ్రామల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు అయినప్పటి నుండి ఘణపూర్, గుడికందుల మీదుగా వెళ్ళిన ఔటర్ రింగ్ రోడ్డు పై రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతు న్నాయి. ఇదే క్రమంలో గణపూర్ గ్రామం వద్ద రెండు కార్లు ఎదురేదురుగా ఢీకొన్నాయి. సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు లేక తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలి పారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని రెండు గ్రామాల ప్రజలు వెల్లడించారు. ఇప్పటికైనా ఔటర్ రింగు రోడ్డు పై కాంట్రాక్టర్ తక్షణమే చర్యలు తీసు కొని సూచిక బోర్డులతోపాటు స్పీడ్ బ్రేకర్లను ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మండలం మీదుగా మల్లన్న సాగర్ ఔటర్ రింగ్ మొదలైనప్పటి నుండి వెంకటాపూర్ నుంచి తొగు ట వరకు, సిద్దిపేట నుండి దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారులు గణపురం వద్ద కలవడంతో చౌరస్తా గా ఏర్పడిందన్నారు. నాలుగు రోడ్లు కలిసిన ప్రదే శంలో స్పీడు బ్రేకర్లు, సూచిక బోర్డులు లేక తరచు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వెంటనే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు పై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రింగు రోడ్డుకు పక్కనే ఘనపూర్ ప్రభుత్వ పాఠశాల ఉందని విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో వాహనదారుల వేగంతో రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉందని అన్నారు. గత పది రోజుల క్రితం గుడికందుల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యా రని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రమా దాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెంటనే అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.