– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా,వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 06 సిసి కెమెరాలను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి మంగళవారం ప్రారంభించారు. మీ కోసం కార్యక్రమంలో సందర్భంగా యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీస్ వారితో సమానం అని సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియత్రించవచ్చు అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని, ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని చెప్పారు.నిఘా నేత్రల నీడలో నేరాల నియంత్రణ పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజల రక్షణ భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేయడం జరుగుతుందన్నారు . సీసీ కెమెరాలు ఉంటే గ్రామంలలో , కాలనీ లలో ప్రజలకు రక్షణగా సెక్యూరిటీగా 24 గంటలు పనిచేస్తాయని తెలిపారు.
ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు.యువత చెడు మార్గాల వైపు మరలకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి , ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహించడం జరుగుతుందని,యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందన్నారు . క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని ఎస్పి అఖిల్ మహాజన్ యువకులకు సూచించారు. కెమెరాలని ఏర్పాటు చేసినందుకు ట్రాక్టర్,టెంట్ హౌస్ అసోసియేషన్ వారిని జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం యువకులకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ, నవత, సర్పంచ్ పాటి దినకర్, ఎంపిటిసి అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ రవి, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.