నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పూట సమయం దాటి షాప్ ని తెరిచి ఉండడంతో ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్సై యాసిర్ అరాఫత్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిసిన వివరాల ప్రకారం..హాజీ కిరాణా షాప్ అహ్మద్పుర కాలనీ యజమాని ఖలీల్ పై కేసు నమోదు చేసి రెండవ టౌన్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనికి ఒకరోజు జైలు శిక్ష వధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై యాసిర్ అరాఫత్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ తమ దుకాణాలను నిర్ణిత సమయంలో మూసివేసి పోలీసులకు సహకరించగలరని కోరారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినచో అటువంటి వారిపై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరిచి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.