
2034 వరకు అటవీ ప్రాంతంలో చేపట్టే చెట్ల పెంపకం పై ప్రణాళిక సిద్ధం చేయడానికి సెక్షన్ అధికారులు బీట్ అధికారులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి రవి మోహన్ భట్ పదేళ్లపాటు అడవుల అభివృద్ధికి చెట్ల పెంపకం ఇతరత్రా కార్యక్రమాలపై చేపట్టనున్న ప్రణాళికపై ఒకరోజు శిక్షణలో పలు విషయాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి తుకారం రాథోడ్ సెక్షన్, బిట్ అధికారులు పాల్గొన్నారు.