
పట్టణంలోని యానం గుట్ట సమీపంలో మహారాష్ట్రకు చెందిన బాలు ప్రకాష్ బోదిలే (40 )సంవత్సరాలు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగు సంవత్సరాల క్రితం ఈయన బతుకుతెరువు కోసం పట్టణానికి వచ్చి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా భార్య, పిల్లలకు దూరంగా ఉండడంతో మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు .తల్లి జయబాయి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.