
ప్రమాదం చెప్పి రాదు. ప్రాణం చెప్పి పోదు.అందుకే వృత్తి నిర్వహణలో అప్రమత్తం ఉండాలని చెప్తారు.ఏమి అవుతుంది లే అనే నిర్లక్ష్యం ప్రాణాలనే తీసేస్తుంది.
మృతుడు పెనుబల్లి కన్నా రావు(23) సోదరుడు ప్రసాద్ పిర్యాదు మేరకు ఎస్.ఐ శివ రామ క్రిష్ణ తెలిపిన కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మొద్దులు మడ కు చెందిన కన్నా రావు విద్యుత్ దీపాలు అమర్చే పని చేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం వినాయకపురం పంచాయితీలో వీది దీపాలు ఏర్పాటు చేయడానికి కూలీ పనికి వచ్చాడు. విద్యుత్ స్థంభం పై బల్బు అమర్చే క్రమంలో అదే లైన్ పై ఉన్న లెవెన్ కేవీ విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తు కన్నా రావు చేయి తగలడంతో విద్యుత్ ఘాతుకానికి గురయ్యాడు. స్థంబంపై బడి నుండి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిపోస్ట్ మార్టం నిర్వహించి విచారణ చేస్తున్నాం అనీ ఆయన తెలిపారు.