చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి

– రామచంద్ర పల్లి లో విషాదం

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఆర్మూర్ మండలంలోని రామచంద్ర పల్లి గ్రామంలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్ర పల్లి గ్రామానికి చెందిన నవీన్ చేపలు పట్టడానికి శనివారం సాయంత్రం చెరువులోకి వెళ్ళినాడు. చెరువులో చేపలు పడుతున్న సమయంలో లోనికి వెళ్ళినాడు. రాత్రి సమయానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందినారు. ఉదయం చెరువులో మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఈయనకు ఇంకా పెండ్లి కాలేదని, గతంలో నవీన్ యొక్క తండ్రి కూడా ఇలాగే చెరువులో పడి చనిపోయినట్టు స్థానికులు తెలిపారు.