
జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన శ్రీరాముల శ్రీకాంత్(32) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి….కోరుట్లకు చెందిన శ్రీరాముల శ్రీకాంత్ తన బైకుపై గత నెల 28వ తేదీన పనిపై ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో కమ్మర్ పల్లి మండల కేంద్ర శివారులో అగ్రికల్చర్ చెక్ పోస్ట్ దగ్గర ఎదురుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి నుండి వస్తున్న ఆటో శ్రీకాంత్ బైకు కు గుద్దడంతో శ్రీకాంత్ రోడ్డుపై పడి తలకు కాళ్లకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఇప్పటివరకు ఆసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం సాయంత్రం సమయంలో చనిపోయాడని తెలిపారు. తగు చర్య కొరకు మృతుడి అన్న బుధవారం ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.