రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరగడంతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు మంగళవారం తెలిపారు. ఒకటవ పోలీస్ స్టేషన్బు బ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయములో తల మీద గ్రామానికి చెందిన సామ లక్ష్మీబాయి వైఫ్ ఆఫ్ పండరి గౌడ్ ని బస్సు ఢీకొనడం వలన ఆమె యొక్క రెండు కాళ్లు విరిగి విరిగినాయి తలకు గాయం అయింది అని తెలిపారు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అని తెలియజేశారు.  చికిత్స పొందుతూ మరణించిందని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. ఈ  విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలియజేశారు.