
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలో ఈ నెల నవంబర్ చివరి వరకు నూరు శాతం ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేయాలని డి ఎల్ పి ఓ స్వరూప రాణి ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూప రాణి మాట్లాడుతూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు పాటించుకుంటూ, ప్రతి గ్రామ పంచాయతీకి వందకు వందశాతం ఇంటి పన్నులు వసూలు అయ్యే విధంగా కృషి చేస్తూ, వివిధ గ్రామాల్లో ఉన్న పంచాయతీ రికార్డ్స్, విలేజ్ పార్క్స్, స్మశాన వాటికలు, సిగ్రేషన్ షెడ్స్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీఓ శ్రీధర్ రావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.