పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి

– ప్రత్యేక తరగతులు చేపట్టాలి
– అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పది పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వంద శాతం ఫలితాలు సాధించే విదంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్  విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని పాఠశాలల్లో మెరుగైన విద్యానందిస్తున్నామని పిల్లలకు నూరు శాతం ఫలితాలు ఉండాలని సూచించారు. పరిక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు చేపట్టాలని , కొన్ని సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులకు అర్థమైయ్యే విదంగా విద్యానందించాలని సూచించారు.జిల్లా, మండల స్థాయి విద్యా శాఖాధికారులు అన్ని పాఠశాలలు, వసతి గృహాలలో నిరంతరం తనిఖీలు చేపట్టి పర్యవేక్షణ చేయాలని అన్నారు.అదేవిదంగా హైద్రాబాద్  రోబోటిక్స్ అకాడమీ కింద జిల్లాలో ఎంపికైన 10 పాఠశాలల్లో కోదాడ లోని జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్, జడ్.పి.హెచ్.ఎస్, బాయ్స్ సూర్యాపేట లోని జడ్.పి.హెచ్.ఎస్, జి హెచ్ ఎస్ జి జే యం, జి హెచ్ ఎస్ ఎం . ఎ . ఎం, జి హెచ్ ఎస్ హనుమనగర్, జి హెచ్ ఎస్ నెం.2,  చివ్వేంల మండలంలోని  జడ్.పి.హెచ్.ఎస్ కుడకుడ, జడ్.పి.హెచ్.ఎస్ చివ్వేంల, కేజీబీవీ చివ్యెంల పాఠశాలలు ఉన్నాయని  ఈ పాఠశాలల్లో విద్యార్థులకు రోబోటిక్స్ అకాడమీ ద్వారా  నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఈ. ఓ అశోక్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఐటీ హబ్ కి కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి పేదలకు ఇవ్వాలి: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనీ కుడ కుడ శివారు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 126 లో అక్రమంగా రెడ్డి కమ్యూనిటీ హాల్, ఐటీ హబ్ లకు కేటయించించిన స్థలాన్ని రద్దు చేసి ఆ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ అధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కుడ కుడ శివారులో ఉన్న వంద ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఐదు ఎకరాలలో నిలువ నీడ లేని నిరుపేదలు గత నాలుగు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని అన్నారు. వీరందరికీ పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్వో, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం, గత ప్రభుత్వంపై మా పార్టీ అధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాము అని గుర్తు చేశారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వకుండా పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించి అక్రమ కేసులు పెట్టించాడని దుయ్యబట్టారు. ఆ భూమిని పేదలకు చెందకుండా బిఆర్ఎస్ నాయకులు, అతని అనుచరులు కబ్జా చేసి 58,59 జిఓ లో పట్టాలు చేపించుకని అమాయక పేద ప్రజలకు అమ్ముతున్నారనీ అవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ఎన్నికలలో గెలవాలని ఎన్నికల ముందు అక్రమంగా రెడ్డి కమ్యూనిటీ హాల్, ఐటీ హబ్ లకు కేటాయించడం అన్యాయం అన్నారు. సూర్యాపేట లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు, బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూమిని వెలికి తీసి ఐటీ హబ్ కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే గుడిసెలు వేసుకున్న స్థలాన్ని పేదలకు 126గజాల చొప్పున ప్రతి ఒక్కరికీ ఇచ్చి,నిర్మాణానికి పది లక్షల రూపాయిలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా పార్టీ అధ్వర్యంలో పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన,ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పార్టీ డివిజన్ నాయకులు ఎస్కె సయ్యద్,వీరబోయిన రమేష్, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సురం రేణుక,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి ఐ. టి. టి.డి.ఎస్. చేయించుకోవాలి.డి.డి.ఓ లకు ఒక్క రోజు అవగాహన కార్యక్రమం నిర్వహణ. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. జిల్లాలో ఉన్న అన్ని శాఖల డి.డి.ఓ లు, సిబ్బంది విధిగా ఆదాయపు పన్ను చెల్లింపు తో పాటు టి.డి.ఎస్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కోశాధికారి రవి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆదాయపు పన్ను టి.డి.ఎస్.  వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి  ముందుగానే ఆదాయపు పన్నును 12 నెలలుగా విభజించి ప్రతినెల వేతనం  ద్వారా  ఆదాయపు పన్ను శాఖకు చెల్లించి తదుపరి ప్రతి త్రైమాసానికి టి.డి.ఎస్. 24 క్యూ  చేయించుకోవాలని,   సూచించారు. ఆదాయపు పన్ను చెల్లించి టి.డి.ఎస్. చేయించుకోక పోతే రోజుకు రూ.200 చొప్పున అపరాధ రుసుమంకి సంబంధించిన నోటీసులు  అధికారులకు అందుతాయని తెలిపారు. అదేవిదంగా ఆన్లైన్ ద్వారానే డి.డి.ఓ లు  ఫామ్ 16 ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగి విధిగా ఫిబ్రవరి వేతనంలో పన్ను మినహాయింపు చేసి ఆదాయపు పన్ను శాఖకు అందచేయాలని సూచించారు.హైద్రాబాద్ నుండి వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు మానస్ రంజన్ బెహ్రా, పౌలియన్ హాంగ్ ఆదాయపు పన్ను విది విధానాలపై అలాగే 24 క్యూ, టి.డి.ఎస్ ట్రసెస్  పోర్టల్ ఎలా వినియోగించాలానే అంశం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సి.ఈ. ఓ సురేష్,   జిల్లా ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకాష్ శర్మ, ఏ.టి.ఓ లు అనిల్ కుమార్, శ్రీనివాస్, ఎస్.టి.ఓలు, ఇన్సెక్టర్స్ వీరెందర్, కిరణ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.