నవతెలంగాణ – బెజ్జంకి
రోడ్డు దాటుతున్న వాహనదారుడిని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గుండారం గ్రామానికి చెందిన కొంపల్లి నరసయ్య (50) తన వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో సిద్దిపేట నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఏర్టీగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలైయ్యాయి. ఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి బాధితుడిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.బాదితుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.