భూ వివాదం నేపథ్యంలో దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్ఐ పీ శ్రీకాంత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జమ్మిగూడెం కు చెందిన పెన్నాడ రామకృష్ణ(దత్తుడు)కు, అదే గ్రామానికి చెందిన మరికొంతమందికి సర్వే నంబర్లు 14, 15/1, 16/ఇ లోగల వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 5వ తేదిన వ్యవసాయ భూమిలోకి రామకృష్ణ వెళ్లగా వెనుక నుంచి వచ్చిన శింగులూరి బాలకృష్ణ, శింగులూరి నాగేశ్వరరావు, ఆళ్ల వెంకటేశ్వరరావు కలిసి దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దాంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది, ఆలస్యంగా బుధవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దాంతో దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.