నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఒకరికి జైలు శిక్ష పడిందని ఒకటవ పోలీస్ స్టేషన్ సిఐ రఘుపతి బుధవారం తెలిపారు. సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉల్లంగించి లైసెన్స్ లేని వ్యక్తులు సౌండ్ సిస్టం లను కిరాయి కి ఇచ్చిన మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామానికి చెందిన నిమ్మల వంశీ నీ కోర్ట్ లో ప్రవేశపెట్టిగా నిమ్మల వంశీ కి రెండవ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్ష విధించారు అని సిఐ రఘుపతి తెలిపారు.