రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి త్రీవ గాయాలు

నవతెలంగాణ – మోర్తాడ్

ద్విచక్ర వాహనంపై  నిజాంబాద్ వైపు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి శుక్రవారం ఉదయం మోర్తాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నాలుగున్నర సమయంలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ మినీ వెహికల్ ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో నలుగురిని నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బైక్ ని నడిపిస్తున్న మార్క వినయ్ 16 మృతి చెందినట్లు తెలిపారు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి శివ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడని, అశోక్ లైలాండ్ లోని ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. మృతి చెందిన వినయ్ గురువారం జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.