నవతెలంగాణ – అశ్వారావుపేట
ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఆదివారం ఓ వివాహిత మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పంచాయితీ దొంతికుంట కు చెందిన పచ్చినీల జ్యోతి (37), తన భర్త రాజాతో కలిసి ఏపీలోని ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం,బయ్యన్నగూడెం లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అనంతరం ద్విచక్రవాహనంపై తిరిగి తమ స్వగ్రామానికి వచ్చే క్రమంలో జీలుగుమిల్లి మండలంలోని గంపలగూడెం సమీపంలో వాహనం అదుపుతప్పి పడిపోవడంతో వెనుక కూర్చున్న జ్యోతి కి తీవ్రగాయాలు అయ్యాయి.వెంటనే 108 వాహనంలో ఆశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి ఆసుపత్రికి రాకమునుపే పరిస్థితి విషమించి మృతి చెందింది అని నిర్ధారించారు.మృతురాలికి భర్త,ఇద్దరు సంతానం ఉన్నారు. జీలుగుమిల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.