
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం పెద్ద కొడపగల్ మండల బీజేపీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించిన జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పని చేసినా దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి ఎవరంటేముందుగా మనకు గుర్తుకు వచ్చే పేరుడాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన భావజాలంతోసుధీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసుకున్నారు.జమ్మూ కాశ్మీర్ సమస్యను ముందుగా అర్థం చేసుకున్న వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు,స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఆర్టికల్ 370 ని తీసుకురావడాన్ని ఆయన ఖండించారుఆ సమస్యపై పోరాటం మొదలు పెట్టారు.దానికి పూర్తి పరిష్కారం కోరుతూ తన గళమెత్తారు. బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు భారతదేశ హక్కులు, ప్రయోజనాల కోసం విజయవంతంగా పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్,ప్రేమ్ సింగ్,తానాజీ,మోహన్,వెంకటకృష్ణ,