నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల పీ.జీ. మొదటి సెమిస్టర్ ( ఎంఏ, /.ఎం. కాం / ఎం. ఎస్. డబ్ల్యూ / ఎం ఎస్సి/ ఎంబీఏ./ ఎంసీఏ) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల ( ఏ.పి.ఈ/ ఐ.పి.సిహెచ్ / ఐఎంబీఏ/)7వ, సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నాలుగవ రోజు ప్రశాంతంగా ముగిసాయి. బుధవారం జరిగిన పరీక్షకు ఉదయం 1911 మంది విద్యార్థులకు 1793 మంది విద్యార్థులు హాజరయ్యారు. 117 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ( 01)ఒకరు చూచిరాతకు పాల్పడ్డట్టు యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు. ఈ పీజీ పరీక్షలు తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తెలంగాణ వర్సిటీ బిక్నూర్ సౌత్ క్యాంపస్,గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి,గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూరు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బోధన్ సెంటర్లలో జరుగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంట చంద్రశేఖర్ తెలిపారు.