
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం గ్రామానికి చెందిన రాజమల్లు 47టాక్టర్ వాటర్ ట్యాంకర్ ను ఢీ కొని మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాల ప్రకారం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన రాజమల్లు ఒక మని నిమిత్తం సదాశివ్ నగర్ మండలంలోని ఉట్నూర్ గ్రామానికి ద్విచక్ర వాహనం పై వేళ్తుండగ అదే సమయంలో ఇందల్ వాయి టోల్ ప్లాజా కు చెందిన ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ రాహదరి మద్యలో ఉన్న డివైడర్ల వద్ద చెట్లకు నీరు పోస్తుండగా ట్రాక్టర్ ట్యాంకర్ వెనుకనుండి డీ కొనడంతో తివ్రగాయల పాలైనట్లు ఎస్సై మహేష్ వివరించారు. స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు.టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాజమల్లు మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.