నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్లీ నగర్ తాండ జాతీయ రహదారి 44 పై శనివారం మధ్యాహ్నం సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ నుండి జాక్రన్ పల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు రహదారి కింద పడిపోవడంతో బాలయ్య 58 నెత్తికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.