ప్రమాదానికి గురై ఒకరి మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఒకరు ఆదివారం మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గొల్లగూడం కు  చెందిన పంపర్ల నాగరాజు(43), ఇతని స్నేహితుడు పోలిన నారాయణ కలిసి ఈ నెల 12 వ తేదిన మేడారం జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14 వ తేదిన తమ గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ వద్ద వేగంగా దూసుకొచ్చిన జే సీ బీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజును విజయవాడ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య శంకుతల దేవి  లిఖిత పూర్వక ఫిర్యాదుతో జే సీ బీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.