దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు

– నలుగురిపై కేసు నమోదు
నవతెలంగాణ –  తాడ్వాయి 
తాడువాయి  మండలం చిట్యాల లో ఒకరిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. భూమి తగాదాల సరిహద్దుల విషయంలో జరిగిన గొడవలో గ్రామానికి చెందిన శంబల భూపతి అనే వ్యక్తిపై శంబల రవి ,శంబల మైపాల్, శంబల రాజయ్య మరొకరు కలిసి రాళ్లతో ,కట్టెలతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. దీంతో భూపతి తలకు తీవ్ర గాయాలయ్యాయి తల పడడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు ఈ విషయమై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు ఫిర్యాదు పై స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు నలుగురిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై వివరించారు.