1500 ఓటర్లకు ఒక్క పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు

– కందుకూర్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌
– నాలుగు మండలాల్లో 5 లక్షల27 వేల 64 మంది ఓటర్లు
నవతెలంగాణ-కందుకూరు
1500 వందల ఓటర్లు దాటిన దగ్గర ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు కందుకూరు ఆర్డీవో సూరజ్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో పోలింగ్‌ స్టేషన్లపై అవ గాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1500 వందల ఓటింగ్‌ దాటిన దగ్గర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు నూతనంగా పోలింగ్‌ స్టేషను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇంతవరకు పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 511 ఉండగా ప్రస్తుతం నూతనముగా 31 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం 542 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 1500 ఓటర్లకు గాను 700 మంది ఓటర్లకు ఒక ఈవీఎం మిషన్‌ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శేఖర్‌ సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు మండలాల్లో ఓట్ల వివరాలు
కందుకూరు ఆర్డీవో పరిధిలో నాలుగు మండలాల్లో ఓట్ల వివరాలు సరూర్‌నగర్‌ మండలంలో 133 పోలింగ్‌ స్టేషన్లో 1,21,844మంది ఓటర్లు, బాలాపూర్‌ మండలంలో పోలింగ్‌ స్టేషన్లు 245 మంది ఓటర్లు ఉండగా 291215 మంది ఓటర్లు ఉన్నారు. మహేశ్వరం మండలంలో 72 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు, 64,480 మంది ఓటర్లు ఉన్నారు. కందుకూరు మండలంలో 61 పోలింగ్‌ స్టేషన్లో ఉండగా 49525 ఓటర్లు ఉన్నారు. నాలుగు మండలాల్లో 5,27,064 మంది ఓటు హక్కు కలిగిన వారు ఉన్నారు.