ఒకరికి ఒకరు

One to oneప్రమిదలో నూనెలా
తను కరిగిపోతుంటే
వత్తిలా అతను వెలిగాడు…!
తను నదిలా మారింది
సంద్రం అతనయ్యాడు…!
త్రివేణి సంఘమంలా
ఒకరిలో మరొకరు పెనవేసుకుపోయారు.!
తను పువ్వులా విచ్చుకుంది
అతడు దారంలా అంతర్ధానమైపోయాడు..!
వసంతం తనయ్యింది
వర్ష ఋతువులా అతనొచ్చాడు..!
తను తారగా వెలుగుతోంది
అతడు దారులు అన్వేషిస్తున్నాడు..!
తీరంలా తను
కెరటంలా అతడు
విడదీయలేని బంధంలా ఒకరికి ఒకరు..!
– డాక్టర్‌. మహమ్మద్‌ హసన్‌
9908059234