ఘనంగా మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం..


నవతెలంగాణ చివ్వేంల : మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ ప్రాంగణములో ఉన్న శ్రీఉమామహేశ్వరస్వామికి పుష్యమాసశివరాత్రి సందర్భంగా గురువారం బ్రహ్మశ్రీ మంత్రమూర్తి మనోహరశర్మ ఆధ్వర్యంలోమహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులుఅత్యంత భక్తిశ్రద్ధలతో అభిషేకంలో ఫాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమములో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..