
గుడుంబా తయారీ కేసులో మండలంలోని హాస కొత్తూర్ వడ్డెర కాలనీకి చెందిన ఇరుగదిండ్ల రేణుక ను మంగళవారం తహసిల్దార్ ఆంజనేయులు ముందు బైండోవర్ చేసినట్లు మోర్తాడ్ ఎక్సైజ్ సిఐ గుండప్ప తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో గుడుంబా తయారు చేస్తున్న రేణుకను పట్టుకొని తహసిల్దార్ ముందు బైండోవర్ చేశామన్నారు.మొదటి తప్పుగా కౌన్సిలింగ్ నిర్వహించి పంపించడం జరిగింది అన్నారు. గత జులైలో మరోమారు గుడుంబా తయారు చేస్తున్న రేణుకను రెండోసారి పట్టుకున్నామని, తహసిల్దార్ ముందు బైండోవర్ చేయగా నోటీసులు ఇచ్చి రూ.10వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. జరిమానా చెల్లించేందుకు మూడు నెలల సమయం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మూడు నెలల సమయం గడిచిన జరిమానా చెల్లించకపోవడంతో మరో మారు రేణుకను మంగళవారం తహసిల్దార్ ముందు హాజరు పరిచినట్లు వివరించారు. మందలించి జరిమానా చెల్లించేందుకు పది రోజుల సమయాన్ని తహసిల్దార్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ గుండప్ప తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు కళ్యాణి మనోజ్, అశోక్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.