ఈవీఎంలపై కొనసాగుతున్న అవగాహన

నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ ఆదేశానుసారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈ.వీ.ఎం)పై ఓటర్ లకు అవగాహన గురువారం కొనసాగింది. ఇందులో నమూనా బ్యాలెట్ యూనిట్, వి.వి ఫ్యాట్, కంట్రోల్ యూనిట్ లు ఉంటాయి. వీటిపై అపోహలను, అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఓటరు అయిన ఎవరైనా స్వయంగా వచ్చి అవగాహన చేసుకోవచ్చని తహశీల్దార్ లూదర్ విల్సన్ తెలిపారు. కావున నియోజకవర్గంలోని ప్రతీ ఓటర్ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.టి సుచిత్ర, సిబ్బంది పాల్గొన్నారు.