కొనసాగుతున్న సీఎం కప్పు క్రికెట్ పోటీలు ..

Ongoing CM cup cricket competitions..నవతెలంగాణ –  సిద్ధిపేట 
ఆదివారం జరిగిన సీఎం కప్పు క్రికెట్ పోటీలలో  చిన్న గుండవెల్లి, మల్యాల జట్లు తలపడగా   మల్యాల 35 రన్స్  తేడాతో గెలుపొందగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అజయ్ కు వరించింది. రెండవ మ్యాచ్ లో  మిట్టపల్లి, మాచాపూర్ జట్ల మధ్య జరుగగా మిట్టపల్లి  74/1 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సురేష్ యాదవ్ అందుకున్నారు. మూడవ మ్యాచ్ లో  గోపులాపూర్ , భక్రిచెప్యాల్  జట్ల మధ్య జరుగగా బక్రీచెప్యాల్ 9 వికెట్ల  తేడాతో గెలిచింది. ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనిల్ దక్కించుకున్నాడు. నాలుగవ మ్యాచ్  గాడి చర్లపల్లి,  వారియర్స్ 11 జట్ల మధ్య జరుగగా  గాడి చర్లపల్లి 42 రన్స్  తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కబాలి దక్కించుకున్నాడు. ఈ రోజు గెలుపొందిన జట్టు విజేత లకు సిఎం రేవంత్ రెడ్డి ట్రోపి ఆర్గనైజర్ గడ్డం శ్రీనివాస్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చెంది రెడ్డి నరేందర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, నరేష్, బాబ్జి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.