మండలంలోని బేగంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని ఫీల్డ్ అసిస్టెంట్ వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ ఎస్సీ భూముల, లెవలింగ్, చదును, రాళ్ల తొలగింపు మొదలగు పనులు చేపడుతున్నామని తెలిపారు. రోజువారి కూలీలు 30 నుంచి 40 మంది హాజరు అవుతున్నారని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనులు చేస్తున్నారని తెలిపారు. రోజువారీ కూలీ150నుంచి200వచ్చే విధంగా పనులు చేస్తున్నారని పేర్కొన్నారు.