నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని జామ్, బీరవెల్లి, తాండ్ర(జి), బొరిగామ్ గ్రామాల్లో శుక్రవారం ప్రజా పాలన గ్రామసభ లు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేపట్ట బోయే పథకాలు ఇందిరమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు పై ఇదివరకు దరఖాస్తు చేసుకున్న అర్హుల పేర్లు అధికారులు సభలో చదివి వినిపించారు. అర్హులై ఉండి పేర్లు రానివారి నుండి దరఖాస్తులను స్వీకరించారు. తాండ్ర(జి), బీరవెళ్లి,గ్రామాల్లో ప్రశాంతంగా జరుగగా బొరిగామ్ గ్రామ అనుబంధ గ్రామం గొడిసర గ్రామానికి ఎలాంటి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు లబ్దిదారుల పేర్లు రాలిపోవడం నిరాశకు గురైయ్యారు. జామ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పై గందరగోళం నెలుకుంది ఇండ్లు ఉన్నవారికే జాబితాలో పేర్లు వచ్చాయని నిరుపేదలకు పథకాల్లో పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు లక్ష్మీ కాంతారావు, అజీజ్ ఖాన్, మానిక, దేవిధాస్ లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నరసయ్య, జూనియర్ అసిస్టెంట్ శేఖన్న, రికార్డు అసిస్టెంట్ అశోక్, ఎపిఓ లక్ష్మారెడ్డి, ఏఈఓ లు,ఎఫ్.ఏ లు గ్రామస్థులు పాల్గొన్నారు.