కొనసాగుతున్న ఎంఎస్‌పీ రిలే నిరాహార దీక్షలు

నవతెలంగాణ-కాశిబుగ్గ
రాబోయే పార్లమెంటు ప్రత్యేక స మావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపె ట్టాలని కోరుతూ కాశిబుగ్గలోని అంబేద్క ర్‌ జంక్షన్‌ వద్ద ఎంఎస్పి వరంగల్‌ తూర్పు ఇంచార్జ్‌ ఈర్లకుమార్‌మాదిగ ఆధ్వర్యం లో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు గురు వారం రెండోరోజుకు చేరాయి. వీహెచ్పీ ఎస్‌ వరంగల్‌ జిల్లా మాజీ కన్వీనర్‌ బొ మ్మకంటి సదిమాదిగ, టిపిసిసి సోషల్‌ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ అడప మహేష్‌ దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కట్ట రాజశేఖర్‌ మాదిగ మాట్లాడుతూ ఈనెల 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వ ర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగ, మాదిగ ఉప కులాల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను మధుకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుముల పూర్ణయ్య, మెట్టుపల్లి రాధిక, ఆరెకటిక రాష్ట్ర నాయకుడు గోగికార్‌ క్రాంతి కుమార్‌, కొండ్ర రాజు, కలకోట గిరి, పెండ్యాల అరుణ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.