
భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న పల్లె పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 108వ ఉచిత వైద్య శిబిరం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్గ్ మాట్లాడుతూ ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులను గురించిన అవగాహన మరియు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా మన శ్రీ ఆర్కే హాస్పిటల్ భువనగిరి పట్నం నందు స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పదవ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ సమ్మర్ హాలిడేస్ నందు అతి తక్కువ ఖర్చుతో స్త్రీల కొరకు సర్జరీ సౌకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు గ్రామ ప్రజలకు వివిధ పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగుమందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ , డాక్టర్ చావా ఆశ్లేష ఆస్పత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.