ట్రావెల్స్‌ బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

– రెండు రోజులుగా మరో 39 బస్సులపై కేసులు నమోదు
– ఫెనాల్టీ, పన్నులు కలిపి రూ.92వేల జరిమానా వసూలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గడి చిన నాలుగైదు రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా రవాణా శాఖకు చెందిన ప్రత్యేక అధికార బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాల తనిఖీ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందలాది బస్సులను చెక్‌ చేసిన ఆర్టీఏ అధికారులు రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై పలు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో చేపట్టిన తనిఖీల్లో మరో 39 బస్సులపై కేసులు నమోదు చేయగా.. ఇందులో సెం ట్రల్‌ జోన్‌-8, ఈస్ట్‌జోన్‌-9, వెస్ట్‌జోన్‌-7, నార్త్‌ జోన్‌-6, సౌత్‌ జోన్‌-3, డీటీటీ నాగోలు-6 బస్సులపై కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం 156 బస్సులపై కేసులు నమోదు చేసి..కాపౌండింగ్‌ ఫీజు, ఫెనాల్టీ, పన్నుల రూపంలో రూ.7.59 లక్షలు జరిమానా వసూలు చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు..
ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే విధంగా ప్రయివేట్‌ ట్రావెల్స్‌ నిర్వహకులు వ్యవహరిస్తే సహించబోమంటూ హైదరా బాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌(జేటీసీ) సి.రమేష్‌ హెచ్చ రించారు. ప్రజలకు ప్రయాణం భారం కాకుండా సౌకర్యవంతమైన రవాణాను అందించాలన్న ప్రభుత్వ సూచనల మేరకు ఆర్టీఏ అధి కారులతో కూడిన బృందాలు పక్కాగా దాడులు కొనసాగి స్తు న్నాయి.రవాణాశాఖ ఇప్పటికే స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తోందని, నిబం ధనలను గాలికొదిలేసిన 156 ప్రయివేట్‌ బస్సులపై చర్యలు తీసుకోగా..18 వరకు నగర శివారు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లతో పాటు, జాతీయ రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టను న్నారు. ప్రయివేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిబంధనలు ప్రకారం నడుచుకుని రవాణాశాఖకు సహకరించాలని జేటీసీ కోరారు.