కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు మండలంలోని మల్లారం,తాడిచెర్ల,వళ్లెంకుంట,చిన్నతూoడ్లతోపాటు పలు గ్రామాల్లో మూడవరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేసి, డ్రైనేజీల్లో పూడిక తీత, మురికి నీరు నిల్వలు ఉంచకుండా చర్యలు, విధుల్లో రోడ్లపై గుంతలు పూడ్చడంపాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, మార్కెట్, బస్సు షెల్టర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడం, ఖాళీగా ఉన్న ప్లాట్స్ లో నీటిని తొలగించడం.శితిలావస్థలో ఉన్న ఇండ్లు,భవనాలు కూల్చివేయడం, నిరుపయోగంగా ఉన్న బావులు,బోర్ బావులను పూడ్చడం,మురికి కాల్వల్లో మురికి నీళ్లు నిల్వగా ఉండే ప్రాంతాల్లో దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేయడం, విధుల్లో దోమల మందు స్ప్రే చేయడం, నీటి ట్యాoకులు శుభ్రం చేయడం తదితర పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.