నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్ : ఐకేపీ వీవోఏల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి అన్నారు. బుధవారం సిద్దిపేటలో ఐకేపీ వీవోఏల సమ్మెను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వీవోఏల సమస్యలను పరిష్కరిం చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. అధికారులు వీవోఏలతో వ్యక్తి చాకిరి చేయించుకుం టూ కనీస వేతనం ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వీవోఏల అన్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలను విన్నవించి పరిష్కారం దిశగా కషి చేయాలన్నారు. శాంతియుతంగా జరుగుతున్న సమ్మెను ఆటంకం కలిగించాలని చూస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, విఓ ఏ ల జిల్లా నాయకులు కిష్టయ్య, రాజు, చంద్రకళ, లావణ్య, సుష్మా, లక్ష్మయ్య, వంశీ, మాధురి ,హారిక, రైసా బేగం, బాలమణి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొండపాక: ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెల రోజుల నుండి సమ్మె చేయడం జరుగుతున్నది. బుధవారం రోజున కొండపాక మండల కేంద్రంలో ఐకెపి వివోఏ లు తమ సమస్యలు పరిష్కరించాలని బిక్షాటన చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వెంటనే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే కనీస వేతనం 26000 అమలు చేయాలని సేఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని ఇతర సమస్యలన్నీ పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు వారి సమస్యల కోసం సమ్మె చేస్తూ ఉంటే అధికారులు ఏపీఎంలో వారిపై మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ వేధిస్తున్నారని వెంటనే అధికారుల వేధింపులు మానుకోవాలని కోరారు లేనిపక్షంలో గ్రామ సమైక్య సంఘాల మహిళలను ఐక్యపరిచి ఇతర ప్రజా సంఘాలతో పోరాటాలను ఉదతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దొమ్మాట నాంపల్లి యాదయ్య, శంకర్, రాములు, కిష్టయ్య, మహాలక్ష్మి, భాగ్యరాణి,పద్మ, భాగ్య స్వప్న, లక్ష్మి, రేణుక, కష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-గజ్వేల్ : గజ్వేల్ వీవోఏల సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, ఐకేపీ వీవోఏల సంఘం నాయకులు నికిత కనకయ్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు లోన్లు సౌకర్యం కల్పించి బ్యాంకు లింకేజీలు చేయడం వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా లోన్ ఇప్పించి డ్వాక్రా మహిళల కుటుంబాల అభివద్ధికి దోహదపడుతు న్నారని తెలిపారు. ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాలకు సమావేశాలకు డ్వాక్రా మహిళలు తీసుకెళ్లడం జరుగుతుందని ప్రభుత్వ పథకాలను గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి సమావే శంలో తమల్ని భాగస్వామ్యం చేసి రాష్ట్ర అభివద్ధి తోడ్పడు తుంటే కేంద్ర ప్రభుత్వం నుండి అనేక పథకాల కారణమైన మమ్మల్ని కనీసం పట్టించుకోవడంలేదని అన్నారు. ఎన్ని చేసినా తమకు కనీస వేతనాలు అమలు జరపకపోవడం విచారకరమని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని గుర్తింపు కార్డు ఇవ్వాలని భీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లతా రాజు బిక్షపతి అండాలు జ్యోతి సంతోష్ శ్రీనివాస్ నర్సింలు గౌస్ పాల్గొన్నారు.