నవతెలంగాణ – ముధోల్
మండలకేంద్రమైన ముధోల్ తో పాటు రాం టెక్, చింత కుంట తదితర గ్రామాలలో గురువారం ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. అర్హులైన లబ్దిదారుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. ఐతే ముధోల్ రాంటెక్ గ్రామసభలో గ్రామస్తులు రేషన్ కార్డు జాబితాలో అర్హులైన పేర్లు రాలేదని అధికారులను ప్రశ్నించారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు సైతం జాబితాలో పేర్లు వచ్చాయని ఆరోపించారు.దీనితో తహసీల్దార్ శ్రీకాంత్ ముధోల్ గ్రామ సభలో అర్హులైన వారి పేర్లు వచ్చాయని సాంకేతిక లోపంతో ఏమైనా కొందరి పేర్లు రాకుంటే ఆందోళన చెందవద్దని అన్నారు.గ్రామ పంచాయతీ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పటు చేస్తున్నామని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలోఎంపిడిఓ శివ కుమార్, తహశీల్దార్ శ్రీకాంత్, ప్రత్యేక అదికారి రామారావు, ఎఓ రచన, ఎపిఓశిరీష రెడ్డి, సిఐ మల్లేష్, ఎస్ఐ సంజీవ్, ఎంఇఓ రమణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.