– గౌరిపల్లిలో గ్రామ పంచాయతీ
– కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని గౌరిపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సర్పంచ్ బొల్గం అనురాధ నరేందర్‌గౌడ్, ఎంపీటీసీ గార్లపాటి సరితతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలికి పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసినట్టు తెలిపారు. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. వాటిని అధికారులు ఆప్‌లోడ్ చేసిన వెంటనే విధివిధానాలు అమలు అవుతాయని తెలిపారు. గ్రామంలో మహిళ సంఘం భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరుకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలో డ్రయినేజీ పనులను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, సర్పంచులు శ్రీశైలం, శ్యాంసుందర్‌రెడ్డి, రమేష్ యాదవ్, కిష్టమ్మ కుమారుడు మాజీ ఎంపీటీసీ యాదయ్య, రఘుపతి, వెంకట్రాంరెడ్డి, రాములు నాయక్, నాగమణి లింగం గౌడ్, వరలక్ష్మి రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీలు రమేష్, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ భగవాన్ రెడ్డి, నాగర్ కర్నూల్ డీసీసీ ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు అంజయ్య గుప్తా, మోహన్ రెడ్డి, రఘు రాములు, రేణు రెడ్డి, డేవిడ్, చిన్న హరి మోహన్ రెడ్డి, ఢిల్లీ కృష్ణ, ఎన్‌ఎస్‌యుఐ మండల అధ్యక్షులు రమేష్ నాయక్, విష్ణు గౌడ్, అజీమ్, రవీందర్, జనార్దన్ రెడ్డి, కేశవులు, వార్డు సభ్యులు, మండల అధికారులు ఎంపీడీవో శ్రీకాంత్, ఏఈ కటారి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏఈ విద్యాసాగర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.