కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.?

Onion that brings tears.?– మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.3,310
– గ్రామీణ వారాంతపు సంతలో కిలో రూ.60కి విక్రయం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉల్లి ధర చుక్కలు చూడటంతో అటూ వ్యాపారస్తులు, ఇటూ వినియోగదారులు ఉల్లి ఘాటుకు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఉల్లి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మార్కెట్లో ధర చుక్కలు చూస్తుంది. దీంతో చేసేది లేక వ్యాపారులతో వినియోగదారులు వారంతపు సంతలో కేజీ ఉల్లికి రూ.60 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ముగిసిన ఉల్లి ధరల ఘాటు పెరగడమే తప్ప దిగి రావడం లేదు. సీజన్ ముగిసి దిగుబడులు తగ్గిన తర్వాత ఉల్లిధర పైపైకి ఎగబాకుతుంది. ఈ ఏడాది జనవరిలో రూ. 2వేలు దాటని ఉల్లి ధర ే తర్వాత రూ. 2500 దాటింది. జూన్ రెండోవారం నుంచి ఒక్కసారిగా ఉల్లి ధరలు ఎగిసిపడ్డాయి. ఏకంగా రూ. 3వేల మార్కు దాటిపోయింది. జూలై ముగుస్తున్న ధరలు మాత్రం తగ్గడం లేదు. సీజన్ ముగిసిన తర్వాత ధరలు పెరుగుతాయని భావించిన కొందరు రైతులు నిల్వచేసుకొని ప్రతివారం కొంత మేరా అమ్మకానికి మార్కెట్ కు తీసుకెళ్తున్నారు.భూపాలపల్లి మార్కెట్లో క్వింటాల్ గరిష్టంగా రూ.3,310 పలికింది. కనిష్టంగా రూ.2,670 ధర పలుకుతుంది.
తగ్గిన సాగు..
 మండలంలో ఉల్లి సాగు తక్కువే ఎక్కువగా మంథని, పెద్దపల్లి,భూపాలపల్లి నుంచి సరఫరా చేసుకోవడం జరుగుతుంది. మండలంలో 30 ఏక రాల్లో ఉల్లి సాగుచేశారు. దీనికి తోడు పంట చేతి కొచ్చే సమయంలో వర్షాలు లేక బోర్లలో భూ గర్భజ లాలు అడుగంటాయి. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గింది. కోత ప్రారంభం సమయంలో కొందరు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి క్వింటాల్ రూ.1000 చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో రైతుల వద్ద కొనుగోలు చేయని వారికి ఇప్పుడు ఉల్లి వారికి చుక్కలు చూపిస్తుంది. చిరు వ్యాపారస్తులు వారం తపు సంతలో గ్రామీణ అంగట్లో కేజీ ఉల్లిని రూ. 50 నుంచి 60మధ్యన విక్రయిస్తున్నారు. సంతకు రూ.200 తీసుకెళ్తే ఉల్లికే రూ.50 పోగా, టమాటకు రూ.50పోతే, మిగితా రూ. వందకు ఏ కూరగా యాలు రాని పరిస్థితి ఏర్పడిందని వినియోగదా రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలు కూరగాయాలను కొన లాంటనే జంకుతున్నారు.
నష్ట పోతున్నాం.. నారాయణ రైతు
రైతులు పండించిన సమయంలో మద్దతు ధరలు లేక తక్కువ ధరకే అమ్ముకొని తీవ్రంగా నష్టపోయాం. ఉల్లి అమ్మిన తర్వాత మార్కెట్లో వారం, వారం ధరలు పెరగ డంతో క్వింటాల్ వెంబడి రూ.2000 వరకు నష్టం చావి చూశాం. ఇంట్లో నిల్వ చేసుకుంటే మురిగిపోతుంది. రైతులు పండించిన ఉల్లికి ప్రతి ఏడాది కనీస మద్దతు ధర ఉండాలి.
కొనాలంటేనే భయమేస్తోంది.. పొసమ్మ, గృహిణి
పెరిగిన ధరలను చూస్తే ఉల్లిని కొనలాంటేనే భయ మేస్తోంది. కూరగాయాల్లో ఉల్లి తప్పనిసరి కాని పెరి గిన ధరలకు తినడమే మానేసాం. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు కొనుగోలుచేసి గోదాముల్లో నిల్వ ఉంచి ధరల పెరుగుదలకు కారణమైన దళారి వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఉల్లి ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.