ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

– 4 బుకీల అరెస్ట్‌, రూ.43,57,461 స్వాధీనం
నవతెలంగాణ-రంగాడెడ్డి డెస్క్‌
ఐపీఎల్‌ మ్యాచ్‌లు నడుస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ లో బెట్టింగ్‌ నిర్వ హిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. 4 బుకీల అరెస్ట్‌, రూ.43,57,461 స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటీ మాదాపూర్‌, మియాపూర్‌ పోలీసులు సంయుక్తంగా మియాపూర్‌ పీఎస్‌ పరిధిలోని ఫ్లాట్‌ నంబర్‌ 505, శ్రీనిధి సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌, మాతృశ్రీ నగర్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 4గురు బుకీలను పట్టుకు న్నారు. వారివద్ద 43,57,461/- స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌-2024 మ్యాచ్‌లపై గురుయాప్‌, లక్కీ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా సేకరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ లు, ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్‌ల తో పాటు ఐదు (05) బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు 1) ఆలూరు త్రినాధ్‌, 2) మానం రాజేష్‌, 3) బొల్లె స్వామి, 4) మార్పెన్న గణ పతిరావు అనే నలుగురు బుకీలను అరెస్ట్‌ చేశారు.