నవ తెలంగాణ: రెంజల్
రెంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో గత నెల 28 నుంచి ఆరవ తారీఖ వరకు నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఎంపీడీవో శంకర్ గ్రామ కార్యదర్శులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఆదేశించారు. ఈనెల 15న సంక్రాంతి పండుగ ఉన్నందున 14 వరకే దరఖాస్తులు అన్నింటిని పూర్తిచేసేలా చూడాలని ఆయన అన్నారు. రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్ కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. పని లేదు కదా ఆయన వెంట సూపరిండెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి, కార్యదర్శులు రాజు, సాయిబాబా, రజిత, అమ్రిన్, రోజా, కంప్యూటర్ ఆపరేటర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.