– కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య
నవతెలంగాణ-కామేపల్లి
ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన అందించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం కామేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటయించి, కామేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలిపారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పనులు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరు అభివృద్ధికి సహకరించాలని అభివృద్ధే ధేయంగా పనిచేయటం జరుగుతుందని అన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అందించేందుకు సాయి శక్తుల కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏపూరి మహెందర్ కుమార్, పత్తే ఆహ్మద్, తహసీల్దార్ సిహెచ్.సుధాకర్, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎఒ తారాదేవి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, సునీత లక్ష్మీనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, విజయలక్ష్మి, కొండాయి గూడెం సొసైటీ చైర్మెన్ ధనియాకుల హనుమంతరావు, డిటి శంకర్, ఆర్‌ఐ సక్రు, సీనియర్ అసిస్టెంట్ జ్యోతి, ఎపిఒ శ్రీరాణీ, ఎపిఎం సురెందర్, సర్పంచ్‌లు సులోచన, సునిత అర్జున్, రాంచందర్, ఉపసర్పంచ్ రాయల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.