కష్టపడి చదివితేనే భవిష్యత్‌లో రాణిస్తారు

– కెేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
– మంత్రిత్వ శాఖ డిప్యూటీ డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఎ.రాంకిషన్‌
– కెేజీఆర్‌ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం
– కెళాశాల చైర్మెన్‌ కె.గోవింద్‌ రెడ్డి
– ఘెనంగా అధ్వయ మేనేజ్‌మెంట్‌ ఫెస్టివల్‌
నవతెలంగాణ-కీసర
విద్యార్థులు కష్టపడి చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా రాణిస్తారని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డ్రగ్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఎ.రాంకిషన్‌ అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఉన్న కేజీఆర్‌ కళాశాల 15 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రిస్టల్‌ వార్షిక సంబరాలను, ‘అధ్వయ’ మేనేజ్‌మెంట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎ. రాంకిషన్‌ మాట్లాడుతూ.. శ్రమ, క్రమ శిక్షణతో చదివిన విద్యార్థులను విజయం వరిస్తుందన్నారు. దానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేడు ఈ స్థాయికి వచ్చానన్నారు. గురువు లను తల్లితండ్రులను గౌరవించాలని సూచించారు. అభివద్ధిలో దూసుకెళ్తున్న మన దేశంలో యువతదే భవిష్యత్‌ అని పేర్కొన్నారు. కళాశాల చైర్మెన్‌ కె. గోవింద్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాలను లాభాపేక్షతో కాకుండా నాణ్యమైన విద్యను అందించడానికి స్థాపించా మని పేర్కొన్నారు. ఈ 15 ఏండ్లుగా సిబ్బంది సహకారం తో ఎన్నో ఉత్తమ ఫలితాలను సాధించామని చెప్పారు. ఈ సందర్భంగా బోధన, బోధనేతర సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. కళాశాలను భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేర్చుతామని కళాశాల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.వీ రమణరావు తెలిపారు. అంతముందు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. విజయలక్ష్మి స్వాగతో పన్యాసం చేశారు. వివిధ విభాగాల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్లు విజయకుమార్‌, ప్రొఫెసర్‌ సునీత, ప్రొఫెసర్‌ రంగేశ్వర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, వేణు, శ్రీనివాస్‌, భాషా పాల్గొన్నారు.