– శాసనసభ్యులు మందుల సామేల్
నవతెలంగాణ-నూతనకల్ : రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద వాడికి ప్రజా సంక్షేమ పథకాలు అందించడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామేల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రజాపాలన అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ తీగల కరుణ శ్రీ గిరిధర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అతి త్వరగా నెరవేర్చడానికే ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారన్నారు.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందబోతుందని హర్షం వ్యక్తం చేశారు.ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తు ఫారంలను లబ్ధిదారులు సరైన విధానంలో పూర్తిచేసి జిరాక్స్ ప్రతులను జతపరిచి అధికారులకు అందజేసి రసీదును తప్పక పొందవలెనని సూచించారు.అనంతరం అధికారులు ప్రజాపాలన కార్యక్రమ విధివిధానాలను ప్రజలకు చదివి వినిపించారు.తదుపరి దరఖాస్తుల స్వీకరణము ప్రారంభించారు,,ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి,జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి,, ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి, డి ఆర్ డి ఏ పి డి కిరణ్ కుమార్,డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, తహాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఇందిరా,ఆయా శాఖల అధికారులు,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.