
నవతెలంగాణ-మిరు దొడ్డి : ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పొందిన వినియోగదారులు మాత్రమే డిసెంబర్ 31 లోపు ఈ కేవైసీ చేసుకోవాలని మిరుదొడ్డి ఇండియన్ గ్యాస్ ప్రోపేటర్ సోమయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని గ్యాస్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున గ్యాస్ వినియోగదారులు రావడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై 500 రూపాయలకే గ్యాస్ ఇస్తుందనే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సబ్సిడీ గ్యాస్ పై ప్రకటన రాలేదన్నారు. కేవలం ఉజ్వల యోజన పథకం వారికే ఈనెల 31 లోపు ఈ కేవైసీ చేసుకోవాలన్నారు. మండలంలోని గ్యాస్ మీద పెద్ద ఎత్తున ఈ కేవైసీ కి తరలిరావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు.