విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు…

నవతెలంగాణ-చివ్వేంల: విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కుమారి బాబు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదవడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు, ఎంపీడీఓ లక్ష్మి,మండల విద్యాధికారి గోపాలరావు, సర్పంచ్ జూలకంటి సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కళారాణి, బిఆర్ఎస్ నాయకులు గోవిందరెడ్డి, బాబు నాయక్, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.