‘ట్రంప్‌ ఒక్కరే అమెరికాను రక్షించగలరు!

‘న్యూయార్క్‌: న్యూ హంప్‌షైర్‌ ప్రైమరీని కూడా అప్రతిహతంగా నిక్కి హాలే మీద గెలిచిన తరువాత అధ్యక్షుడు జో బైడెన్‌పై డోనాల్డ్‌ ట్రంప్‌ కాలు దువ్వుతున్నాడు. ఐవోవా, న్యూ హాంప్‌షైర్‌ ప్రైమరీలను 1976 తరువాత వరుసగా గెలుచుకున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ మాత్రమేనని అంటున్నారు. ఊహాతీతమైన అవరోధాలమధ్య, తనకు వ్యతిరేకంగా ఐదు కోర్టు తీర్పులుండగా, రాజకీయ ప్రత్యర్థుల దాడుల మధ్య ఒక 77 ఏండ్ల వ్యక్తి ఇటువంటి విజయం సాధించటం చిన్న విషయం కాదు. నిజానికి మాజీ అధ్యక్షుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ట్రంప్‌ ఒక్కరే. అయితే ఈ దాడులు తమ ప్రత్యర్థిని మరింతగా బలపడేలా చేశాయన డెమోక్రాట్లు గ్రహించటానికి చాలా సమయం పట్టింది. ట్రంప్‌ అనుయాయులకు 2024లో జరగనున్న ఎన్నిక మరో ఎన్నిక కాదు. అది అమెరికాను రక్షించటానికి వారికి అందే చివరి అవకాశం. రిపబ్లికన్‌ పార్టీలో అమెరికా యుద్ధ పిపాసకు ప్రాతినిధ్యంవహిస్తున్న నిక్కీ హాలే ఓటమిని ఈ కోణంలోనే చూస్తున్నారు. మధ్యప్రాచ్చంలోను, తూర్పు ఐరోపాలోను యుద్ధాలు చెలరెగుతున్న స్థితిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో అమెరికాలోని యుద్ధ పరిశ్రమ సంతోషంలో తలమునకలౌతోంది. ఈ స్థితిలో హాలే గెలవటాన్ని ఏమాత్రం ఊహించలేము. తన నాలుగేండ్ల పదవీకాలంలో అమెరికాను యుద్ధాల లో దింపకుండా చేయగలిగానని చెప్పుకునే అవకాశం ఒక్క ట్రంప్‌ కు మాత్రమే ఉంది. అమెరికా ప్రమాణాలను బట్టి చూస్తే ఇది అరుదైన విషయమే.